
- రూ.30 వేల జరిమానా
హైదరాబాద్ సిటీ/ ఇబ్రహీంపట్నం, వెలుగు: బాలికపై లైంగిక దాడి కేసులో యువకుడికి పదేండ్ల జైలు శిక్ష పడింది. ఇబ్రహీంపట్నం మండలం ఎంపీ పటేల్ గూడకు చెందిన జంగం నరేందర్ (20) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదిబట్ల పీఎస్పరిధిలోని ఓ బాలికతో 2018లో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, పెండ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాతపై బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అదే ఏడాది ఆదిబట్ల పోలీసులు పోక్సో నమోదు చేసి, రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్దాఖలు చేశారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి, పదేండ్ల జైలుశిక్షతోపాటు రూ.30 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది.